Posts

Tavika on Anagha, my first cousin's daughter on her first birthday - Dated: 27th April 2021

 అనఘానగరాగం శ్రావ్యానంద కరమౌ  షణ్ముఖస్మితం శశాంకమంద్రమౌ అనఘాద్భుత చారిత్ర భరతాధిపత్యమౌ శారదాచంద్రమూర్త్యాంగనఘాయత్రి వర్థిల్లౌ

Verse on SPB on his demise - Dated: 28th Sep 2020

సంగీత ఝరి.. ఎటువంటి ఝరికి అయినా, దానికి స్వరూపం ఇచ్చేది దానికి ఉన్న అవధులు, అవే లేకపోతే, ఝరి అనంతమైపోయి ఉనికిని కోల్పోతుంది. మన తెలుగు పాటలకు, ఒక నా లాంటి సామాన్యుడు పాడుకో గలిగే తెలుగు పాటల ఝరికి ఒక అవధి, బాల సుబ్రహ్మణ్యం గారు. ఈ అవధి, ఒక అడ్డంకి లా కాకుండా, ఈ ప్రవాహానికి ఒక సారూప్యం ఇచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాట రూపు, బాల సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే. “స”, “ప” లు జనరంజకమవ్వాలంటే భాష మరియు భావాల “బ”లిమి కలవాలి అని, “SPB” ని అమ్మవారే మనకి అనుగ్రహించారు. ఆయన స్ఫురణే ఈ ఝరికి స్ఫూర్తి!! ఆ మహానుభావుడికి ఇదే నా పదాంజలి!! - వంగర శ్రీరాం

Tavika on my first cousins on father's side - Dated: 3rd Nov 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika on Sri rama navami - Dated: 21st April 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika on my first cousins from mother's side on Dusshera - Dated: 15th Oct 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika to Mugdha on her Birthday - Dated: 12th Nov 2021

 ముదములలరించు ముగ్ధ కు -  ముద్దుగారే అన్నమయ్య పద ముగ్ధమనోహరమై, ముద్ద మందార పోతన పద్యమనుజ్ఞేయయై, మధ్యమావతి ముచ్చటల శ్రీదేవీరాజసమై, మామ ధన మోహన మాల వ్యాఖ్యాత్యంబర పరమై, మాధవ మదినిల్పు వ్యాస భాగవతి వంశాంకురమై!!  -  ఇట్లు, శుభాశీస్సులతో, పెదనాన్న, వంగర శ్రీరాం

Tavika to my uncle Bhagavati Hari Sastry - Dated: 2nd Nov 2021

 సప్త పదుల స్ఫురణల సరసన; విక్రమ క్రీగంటి క్రీడా కృపార్ధుడవై, శ్రాష్టః సతి సత్సంగ సంభావితుడవై, శతపత్ర సహస్రుని స్తుతి మీర శత సంవత్సర శతానందుడవై, హారికవై హరిని హర్షించుగాక ఈ హరి! -  ఇట్లు  భవదీయుడు వంగర శ్రీరాం